అంబులెన్స్ సిబ్బందిఅందుబాటులో ఉండాలి
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నారాయణపేట మండలం జీవీకే ఈఎంఆర్‌ఐ 1962 మొబైల్ వెటర్నరీ అంబులెన్‌న్స్‌లను గురువారం స్టేట్ ప్రాజెక్టు హెడ్ డాక్టర్ బగిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వివిధ పరికరాలు, వాటి పని తీరు, అదే విధంగా మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్ వచ్చి న వెంటనే 1962 సిబ్బంది తక్షణమే స్పందించి సేవలు అందించాలని, జిల్లాలో ప్రతి అంబులెన్స్ 10 ట్రిప్పులు, అదే విధంగా 20 పైన జంతువులకి వైద్య సేవలు చేస్తున్నట్టు పేర్కొన్నా రు. పశువులకు వైద్య సహాయం కోసం 1962 సమాచారం అందించాలని, మా మొబైల్ వెట ర్నరీ 1962 అంబులెన్స్ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి పశువులకు తగిన శస్త్ర చికిత్స, మందులు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ రవి, ఎగ్జిక్యూటివ్ రాఘవేందర్, డాక్ట ర్ వైష్ణవి,మురళి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ అన్నారు. గురువారం జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ మూడో మహాసభలు నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడు మోహన్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం సరికాదని, ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం కృషి చేస్తుందని, విద్యార్థులను బోర్డు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పదో తరగతి టాలెంట్ టెస్ట్, ఇంటర్ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో మోడల్ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులలో జాతీయ భావాలు పెంపొందించేలా జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు, సమాజంపై అవగాహన కలిగించేందుకు పలు అంశాలపై సెమినార్లు, చర్చాగోస్టి, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. త్యాగాలగడ్డపై 3వ జిల్లా మహాసభలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి నరహరి, జిల్లా నాయకులు మహేందర్, కాశీ, నరసింహా, నయీమ్, శ్రావణి, కవిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment