జనరల్ ఆస్పత్రి @ 900
నారాయణపేట
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
వివరాలు 8లో u
అదనంగా 250 బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎన్‌ఎంసీ ఆదేశాలు
● ఇప్పటికే డీఎంఈకి అందిన ఉత్తర్వులు
● రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయడానికి కసరత్తు
● వసతులు సమకూరినా.. ఖాళీల భర్తీపై దృష్టిపెట్టని ప్రభుత్వం
● అరకొర వైద్యులతో రోగులకు మెరుగుపడని వైద్యసేవలు
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రి 650 పడకల నుంచి 900 పడకలకు అప్‌గ్రేడ్ అయ్యింది. కొత్తగా మరో 250 పడకలు అదనంగా పెంచుకోవ డానికి ఎన్‌ఎంసీ అంగీకరించినట్లు రెండ్రోజుల కిందట డీఎంఈకి ఉత్తర్వులు అందాయి. మరో రెండు నెలల్లో 900 పడకలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేపడుతోంది. పెరిగిన పడకల నేపథ్యంలో సరిప డా వైద్యుల దగ్గరి నుంచి నాలుగో తరగతి, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. పడకల పెంపుపై ప్రభుత్వ వర్గాల నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం 13 విభాగాల్లో 28 పీజీ సీట్లు ఉండగా ఇటీవల అర్థోకు 4, ఈఎన్‌టీ విభాగానికి 3 పీజీ సీట్లు దర ఖాస్తు చేయగా వాటికి సైతం మార్చి మొదటి వా రంలో అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పడకల పెంపుతో జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు మె రుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
పని ఒత్తిడి తట్టుకోలేక..
జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్‌ఆర్‌లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
అనేక కొత్త సమస్యలు
జనరల్ ఆస్పత్రి తాజా పరిస్థితిని పరిశీలిస్తే మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. పడకల పెంపుతో అనేక కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అరకొర సిబ్బందితో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్నవారు పని చేయలేమంటూ వాపోతున్నారు. ఇక కాంట్రాక్టు వైద్యులు తమ వల్ల కూడా కాదంటూ ఇప్పటికే కొందరు తప్పుకున్నారు. ఇక ఆస్పత్రిని ఒంటిచేతిపై నడిపిన ఎస్‌ఆర్‌లు సైతం లేకపోవడంతో ఇబ్బందులు పెరిగి.. జనరల్ ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటిని భర్తీ చేస్తే తప్ప రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి దవాఖానాల్లో వసతులు, ఆధునిక పరికరాలు సమకూర్చుతున్నా.. ఖాళీలపై దృష్టి పెట్టకపోవడంతో రోగులకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి.
జనరల్ ఆస్పత్రి @ 900
Comments
Please login to add a commentAdd a comment