సమష్టి ప్రణాళికతోనే జిల్లా సస్యశ్యామలం
నారాయణపేట: సమష్టి ప్రణాళికతోనే పాలమూరు సస్యశ్యామలం అవుతుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో మర్రి చెన్నారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాధాన్యత లభ్యత, మూడు పంటలకు సాగు నీరు ఎలా ఇవ్వవచ్చు, ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావు రూపొందించిన జల చతుర్భుజ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్‌తో పాటు ఇటు తెలంగాణలోని జహీరాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మండంగా హనుమంతరావు కాన్సెప్ట్ అమలు అవుతోందన్నారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతానికి సాగునీరు ఇవ్వవచ్చని, రూ.5 వేలతో ఎకరాకు సాగునీరు అందించవచ్చని, ఇది పెద్ద ఎత్తున అమలు చేస్తే మరిన్ని ఫలితాలు సాధించవచ్చన్నారు. పండించిన పంటకు ఖర్చు తగ్గించడంతో పాటు, చివరి అయకట్టుకు, సాగు నీరు ఇవ్వవచ్చు, రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంతోనూ జిల్లాకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదన్నారు. నీటి అప్రోచ్ జూరాల నుంచి తీసుకోవాలన్నది ప్రతిపాదన, ఈ పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీల్లో ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరివ్వాలి అని, ఏళ్లు గడుస్తున్నా ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇప్పటికై నా ఒక మంచి లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని, వేలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత రైతుల అభ్యున్నతి, వారికి సాగునీటి ఇబ్బందులు తీర్చడమే నా లక్ష్యంగా, పార్లమెంట్ పరిదిలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తామన్నారు. త్వరలో పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనేత్తుతానన్నారు.
రైతులకు మేలు చేయడమే లక్ష్యం
ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ ఈ విధానంపై సీఎంతో పాటు ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు చేసేవిధంగా చర్యలు చేపడతమన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్.ఆర్‌రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలోని కోయర్ నిర్వహించే ఈ విధానంపై ఈ ప్రాంత రైతులను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆ విధానంతో మూడు పంటలు పండించేందుకు రైతులకు పూర్తి అవగాహన వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్‌రెడ్డి, ప్రముఖ పర్యవేరణ వేత్త పురుషోత్తం రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్‌రెడ్డి, జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు అనంత్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ సుదర్శన్‌రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment