కొనసాగుతున్న భూ సర్వే
ఊట్కూరు: ఊట్కూరు మండలంలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గత రెండు రోజులుగా భూ సర్వే కొనసాగుతుంది. శుక్రవారం తహసీల్దార్ సి రవి ఆధ్వర్యంలో దంతన్‌పల్లి శివారులో భూ సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న పలువురు రైతులు వివిధ పార్టీల నాయకులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతులకు ముందుగా సమాచారం అందించి సర్వే పట్ల రైతులకు అవగాహన కలిపించాలని వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే రైతులకు సమాచారం అందించామని తహసీల్దార్ తెలిపారు. ఆర్డీఓకు సమాచారం అందించి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సముదాయించారు. దంతన్‌పల్లి శివారులో సుమారు 58 ఎకరాల భూమి కోసం సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఎస్‌ఐలు కృష్ణంరాజు ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించారు. ఇరిగేషన్ డీఈ సతీష్, ఏఈ వెంకటేష్, సర్వేబృందం అరుణ, వివిధ పార్టీల నాయకులు అరవింద్‌కుమార్, భరత్, భాస్కర్, ఆనంద్‌కుమార్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment