ఓపీఎస్ సాధనకు అలుపెరగని పోరాటం
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయాల దగ్గర శుక్రవారం సాయంత్రం యుద్ధభేరి వాల్పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో మార్చి 2న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఓపీఎస్ సాధననే ఏకై క మార్గంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బలాన్ని చూయిస్తు, సీపీఎస్ వల్ల జరుగుతున్న నష్టాలను వివరిద్దామన్నారు. పాత పెన్షన్ విధానం వల్ల ఎంతో ఉపయోగకరము ఉంటుందని తెలియచెద్దామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు చైతన్య, డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ప్రసాద్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment