వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మరికల్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యార్థుల తలుపు తట్టండి కార్యక్రమం చేపట్టిందని ఆర్‌జేడీ ఎస్‌ఈ విజయలక్ష్మి అన్నారు. మరికల్ మండలం మాధవరంలో శుక్రవారం ఉదయం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తలుపు తట్టండి కార్యక్రమంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో పనులేవి చెప్పకుండా వారిని టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి ప్రశాంతమైన వాతావారణంలో ఒత్తిడి లేకుండా చదివించాలని సూచించారు. పరీక్షలకు 20 రోజుల సమయం ఉందని ఈ సమయంలో చదవడంతో పాటు రాయడం పైన దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు ఉదయమే వెళ్లడం పట్ల వారిలో పరీక్షల భయం పోగొట్టడం జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా మరింత బాధ్యతగా ఉండి పిల్లలను చదివిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరికల్ బాలుర ఉన్నత పాఠశాలో పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, ఏఏంఓ విద్యాసాగర్, ఎంఈఓ మనోరంజని, జీహెచ్‌ఎం నాగరత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment