మద్దూరు: మద్దూరు పట్టణంలో డిగ్రీ కళశాల భవన నిర్మాణానికి రూ.6.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ ఈ.నారాయణగౌడ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తరగతులు ప్రారంభించామని, ఈ కళాశాల నిర్మాణం కోసం పట్టణ శివారులోని డంపింగ్ యార్డు దగ్గర 5 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. డిగ్రీ కళశాల భవన నిర్మానానికి నిధులు మంజూరు చేసినా సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment