తాగునీటి సమస్య తీవ్రమవుతోంది
గ్రామంలో తాగునీటి సమస్య రోజు రోజుకు జఠిలంగా మారుతుంది. మిషన్ భగీరథ నీళ్లు సంక్రమంగా రాకపోవడంతో బోరు బావుల వద్ద నుంచి నీటిని తీసుకొస్తున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీల కారణంగా నెలలో వారం రోజులు నీరు రావడం లేదు. గ్రామ శివారులోని పొలాల వద్దకు వెళ్లి బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. – లక్ష్మమ్మ, ఇబ్రహీంపట్నం
అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ
ఆర్నెళ్ల నుంచి కాలనీల్లో విద్యుత్ దీపాలు వెలగక చీకట్లో గడుపుతున్నాం. లైట్లు వేయాలని కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన లైట్లు రాలేదని సమాధానం చెప్పుతున్నారు. గ్రామంలో మురుగు రహదా రులపై పారుతుడంటంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. – తిరుపతయ్య, అప్పంపల్లి
నిధులు మంజూరు కావాల్సి ఉంది
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పెండింగ్ బిల్లులతో పాటు విధి దీపాలు, డ్రైనేజీలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరిస్తాం.
– కృష్ణ, డీపీఓ, నారాయణపేట
●
తాగునీటి సమస్య తీవ్రమవుతోంది
Comments
Please login to add a commentAdd a comment