
బాధ్యతాయుతంగా పని చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండ్లకు 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ విధి విధానాలపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించగా.. కలెక్టర్ హాజరై మాట్లాడారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని, సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్‌లు తీసుకురావద్దని, విద్యార్థుల నుంచి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మెత్తం 39 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేయబడ్డాయని మొత్తం 7637 విద్యార్థులు రెగ్యులర్‌గా, 65 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, 39 చీఫ్ సూపరింటెండ్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఆరుగురు కస్టోడియన్లు, ముగ్గురు ప్‌లైయింగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌ఈఓలు కృష్ణారెడ్డి, బాలాజీ, ఏసీజీ ఆంజనేయులు, సీఎమ్‌ఓ రాజేంద్ర కుమార్, యాదయ్య శెట్టి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలు పెంచాలి
విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో నూతన ఉపాద్యాయులకు స్థానిక కెజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తూ జిల్లాను ఎస్‌ఎల్‌ఎన్ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ఏ రకమైనా బోధన పద్దతి తరగతికి సరిపోతుందో అందుకు అనుగుణంగా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ అధికారి విద్యాసాగర్, కోర్సు కో ఆర్డినేటర్ కృష్ణా రెడ్డి, మద్దూర్ ఎమ్‌ఈఓ బాల కిష్టప్ప, ఎస్‌ఎస్‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment