
హైరిస్క్ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట: జిల్లాలో హైరిస్క్ గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేలా వైద్యులు, ఏఎన్‌ఎంలు చూడాలని, ఈమేరకు ప్రతి గర్భిణికి ముందస్తు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం స్కిల్ డెవలప్‌మెంట్ హాల్‌లో జిల్లాలోని ఏఎన్‌ఎంలకు హైరిస్క్ ప్రసవాలపై డీఎంహెచ్‌ఓ, డాక్టర్లు శైలజ,రోహిణి చెవని అర్మాన్ ఆర్గనైజేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ఎల్‌ఎంపీ రిజిస్టర్ ఆధారంగా అర్హులైన గర్భిణులను నిశ్చయ్ కిట్ల ద్వారా పరిక్షిస్తూ నమోదు చేయాలన్నారు. ప్రతి ఏఎన్‌ఎం ఒక గర్భిణిని నమోదు చేసే ముందు కుటుంబానికి సంబందించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని, ఏవైనా ప్రమాద సంకేతాలు (కారణాలు) ఉన్నాయో లేదో తెలుసుకోవాలని, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రైమిస్టర్లలో వారాల ప్రతిపాదికన కాకుండా పర్ అబ్దమెన్ ద్వారా పరీక్షించాలన్నారు. అనీమియా (రక్తహీనత), అధిక రక్తపోటు, మధుమేహం, మూర్చ, గత సిజేరియన్ సెక్షన్ వివరాలు, గర్భదారణ సమయంలో హెచ్‌ఐవి మొదలగు వాటిపై తెలియజేస్తూ, విపులంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో గోవిందరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
నారాయణపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు రాచమల్ల సిద్దేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రివ్యూ సమావేశం డీసీసీ అధ్యక్షుడే కె.ప్రశాంత్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న, జిల్లాలోని పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

హైరిస్క్ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ
Comments
Please login to add a commentAdd a comment