
సొంతింటి కల నిజం చేస్తాం
ధన్వాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని.. ఇల్లు లేని వారందరికీ సొంతింటి కల నిజం చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కంసాన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండలంలో మొదటి విడతలో ఎంపికై న కంసాన్‌పల్లి గ్రామంలో నిర్మాణ పనులు లబ్ధిదారులు మొదలు పెట్టారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో దళితల కేటాయించిన భూమిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోరు పాయింట్లకు భూమి పూజలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోర్లు మంజూరయ్యాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment