పనితీరులో మార్పు రావాలి
నారాయణపేట: నియోజకవర్గంలోని ఐకేపీ అధికారులు, సిబ్బంది పనితీరులో ఇక మార్పు రావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిల్‌కొండలోని ఐకేపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నందన్నారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణ బకాయిలను సమయానికి కట్టించాలని.. వారికి మరింత రుణ సదుపాయం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఇలాంటి పథకాలను మరెన్నో రూపొందించి జిల్లాలోని అన్ని సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రొత్సహించాలన్నారు. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఫలాలను అర్హులైన వారందరికి అందుతాయన్నారు. ఇది వరకు జరిగిన వాటిని తాను అడగదలచుకోలేనని..గతం గతహాః ..రాజకీయాలను పక్కనపెట్టి పార్టీల కతీతంగా మహిళా సంఘాల సభ్యులకు అన్ని విధాలుగా ప్రొత్సహించాలన్నారు. ఐకేపీలోని వీఏఓలు, ఏపీఎంలు, సీసీలు తమ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తుంటామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో ఇంచార్జీ డీపీఎం ఆనందం, సీసీలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment