
ఏడేళ్లుగా ఎదురుచూపులు
గత ప్రభుత్వ హయంలో రిజర్వేషన్ల ప్రాతిపదికన మార్కెట్ పాలకవర్గాలు కొలువుదీరాయి. బీసీ రిజర్వేషన్‌లో చైర్మన్ బండి వేణుగోపాల్ హయంలో దుకాణ సముదాయ నిర్మాణం పూర్తికాగా అప్పటి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. తర్వాత వచ్చిన చైర్మన్ సరాఫ్ నాగరాజు రెండేళ్ల పాటు కొనసాగారు. ఆయన పాలన అంతా ఎన్నికలు, కరోనా కాలంతో ముగిసింది. ఆ తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్‌లో చైర్‌పర్సన్‌గా వెంకట్‌రెడ్డి భాస్కరకుమారి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎస్‌సీ జనరల్ కేటగిరిలో ఎం.జ్యోతి చైర్‌పర్సన్ అయ్యారు. ఆమె పాలన ఏడాది పూర్తిగాకముందే ప్రభుత్వం మారడంతో పాలక వర్గాలు రద్దయ్యాయి. ప్రస్తుత మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి అయినా దృష్టిసారించాలని కోరుతున్నారు.
జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం
● టెండర్లు నిర్వహించరూ..
దుకాణాలు కేటాయించరు
● మార్కెట్‌యార్డుకు
సుమారు రూ.కోటి నష్టం
● రిజర్వేషన్లు ప్రతిపాదించినా..రిజర్వులోనే టెండర్లు
నారాయణపేట: జిల్లాకేంద్రం నడిబొడ్డున వాణిజ్య దుకాణ సముదాయం ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ నిరుపయోగంగానే ఉంది. పాతబస్టాండ్ సమీపంలో రూ.1.56 కోట్లతో 28, రైతుబజార్ కాంప్లెక్స్‌లో రూ.38 లక్షలతో నిర్మించిన 16 దుకాణాలను 2018, ఫిబ్రవరి17న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌యార్డు నిర్మించారు. అక్కడ అద్దెకు షెడ్లు వేసుకున్న వాటిని తొలగించడంతో వారు ఉపాధి కోల్పోతారని 2023లో రైతుబజార్‌లోని 16 దుకాణాలను అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పలువురికి దుకాణాలను ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో కేటాయించారు. వాణిజ్య సముదాయంలోని దుకాణాలు టెండర్లకు నోచుకోక ఏడేళ్లు కావస్తుంది. కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టి సారించి దుకాణాలకు టెండర్లు పిలిచి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు.
రిజర్వేషన్లు ప్రతిపాదించినా..
వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాల్లో 26 వాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షెడ్యూల్ కులాల వారికి 4, షెడ్యుల్ తెగల వారికి 2, బలహీనవర్గాల వారికి (బీసీలకు) 6, దివ్యాంగులకు 1, జనరల్ కేటగిరికి 13 కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల వారీగా టెండర్ నిర్వహించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా జాప్యంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు.
● పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రహదారి విస్తరణ పూర్తయింది. ఇందులో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు వాణిజ్య సముదాయం ఎప్పుడు వినియోగంలోకి తీసుకువస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల కిందటే దుకాణాలకు టెండర్లు నిర్వహించి ఉంటే మార్కెట్‌యార్డుకు రూ.1.18 కోట్ల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు.
ఐదుగురు చైర్మన్లు మారినా..
Comments
Please login to add a commentAdd a comment