ఆస్తి పన్ను లక్ష్యం చేరుకోవాలి
నర్వ: గ్రామపంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ కోరారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. వేసవి ప్రారంభమవుతున్నందున గ్రామాల్లోని ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని, జాబ్‌కార్డు లేనివారికి తక్షణమే అందజేయాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన పనులు గుర్తించి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పన్ను వసూళ్లను కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తాగునీటి ఎద్దడి నివారణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని, కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ రాఘవేందర్, యాదవరాజు పాల్గొన్నారు.
మట్టి నమూనా సేకరణను అడ్డుకున్న రైతులు
మక్తల్: కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు పనులకుగాను ఇరిగేషన్ అధికారులు బుధవారం కాట్రేవుపల్లిలోని ఓ వ్యసాయ పొలంలో మట్టి నమూనా సేకరణకు డ్రిల్ యంత్రంలో వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామ రైతులు అక్కడకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, తహసీల్దార్ సతీష్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. ప్రభుత్వం నష్టపరిహారం ఎంత చెల్లిస్తుందో చెప్పకుంట నమూనాలు ఎలా సేకరిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని పనులు చేస్తే మా మరణాలు చూస్తారని హెచ్చరించారు. పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి మట్టి నమూనాలు సేకరిస్తే సహించమన్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతులు రాజు, జిలానీ, కేశవులు, శ్రీనివాసులు, నర్సింహులు, శివరాజు, రాము, కృష్ణయ్య, శివకుమార్, రఘు, సోమాజీ పాల్గొన్నారు.
పంట మార్పిడితోఅధిక దిగుబడులు
మరికల్: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పంటల మార్పిడి చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్‌చార్జ్ సునీత తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో పంటల సమగ్ర సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. సంస్థ ఆధ్వర్యంలో పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. యాసంగిలో సాగుచేసే వరి, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలకు వచ్చే కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే పంటలకు మేలుచేసే మిత్ర పురుగుల గురించి తెలిపారు. అనంతరం రైతులు సాగుచేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రోన్ సాయంతో మందులను ఎలా పిచిరాకీ చేయాలో వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వెంకట్‌రెడ్డి, ఉదయ్‌శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్, ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం తదితరులు పాల్గొన్నారు.
వేరుశనగ @ రూ.6,780
జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.5,469 ధరలు లభించాయి. పెబ్బర్లు రూ.6,910, పత్తి గరిష్టంగా రూ.6,289, కనిష్టంగా రూ.5,469, కందులు గరిష్టంగా రూ.6,970, కనిష్టంగా రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,026, ఆముదాలు గరిష్టంగా రూ.6,077, కనిష్టంగా రూ.6,020 ధరలు లభించాయి.
ఆస్తి పన్ను లక్ష్యం చేరుకోవాలి
ఆస్తి పన్ను లక్ష్యం చేరుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment