నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. సిబ్బంది ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కేంద్రాల ఆవరణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటిరోజు బుధవారం 4,476 మంది విద్యార్థులకుగాను 4,336 మంది హాజరుకాగా 140 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్‌రావు తెలిపారు. జనరల్ విభాగంలో 3,888 మందికిగాను 3,767 హాజరుకాగా.. 121 మంది గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 588 మందికిగాను 569 మంది హాజరుకాగా 19 మంది రాలేదని వివరించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయని చెప్పారు. డీఈసీ కన్వీనర్ జిల్లాకేంద్రంలోని, డీఈసీ సభ్యులు ఉట్కూరు, మక్తల్, మాగనూర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ లింగయ్య జిల్లాకేంద్రంలోని శీ సాయి జూనియర్ కశాశాల పరీక్ష కేంద్రం తనిఖీ చేశారు. కేంద్రానికి 200 మీటర్ల వరకు ఇతరులు గుంపులుగా తిరగకుండా చూడాలని పోలీసులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment