నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని జిల్లా సంక్షేమ అధికారి జయ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సహకారంతో మహిళా సాధికారిక కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల చదువు దేశానికి ఎంతో ఉపయోగమని.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలతో పాటు కంప్యూటర్ శిక్షణ సైతం ఎంతో అవసరం అన్నారు. అమ్మాయిలను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్ శ్రీలత, కో–ఆర్డినేటర్ నర్సింహులు, అనిత, నర్సింహ, నరేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment