మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్‌లు కేటాయించారు.
ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం వి ద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహ న నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్‌కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment