
డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన అవసరం
నారాయణపేట రూరల్: విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ లెర్నింగ్పై శిక్షణ పొందిన విద్యార్థుల ప్రెసెంటేషన్ చూసి ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ.. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని, గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని టాపికల్స్‌పై పిల్లలు మంచిగా నేర్చుకున్నారని పాజిటివ్ విషయాలకే వాడుకోవాలన్నారు. వ్యక్తిగతంగా, దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త వాటిని రూపొందించాలని సూచించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన డిజిటల్ ఈక్వటీ సంస్థ ఓంకార్, స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, డీఎస్‌ఓ భాను ప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ పద్మ, జిహెచ్‌ఎం భారతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment