
బ్యాంకుల్లో సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ
నారాయణపేట: బ్యాంకుల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు తరచూ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని,సెక్యూరిటీ అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డ్స్ నియమించుకోవాలని, అధిక మొత్తంలో బ్యాంకులకు నగదు తీసుకువస్తున్నా, తరలిస్తున్నా పోలీసుల భద్రత తీసుకోవాలన్నారు.
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
జిల్లా పరిధిలో నిత్యం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment