మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్
నారాయణపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళకు వ్యక్తిగత, కుటుంబ జీవితం ఉంటుందని, ఉద్యోగ పరంగా చాలామంది మహిళలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. ఒక మహిళకు మరో మహిళే సపోర్ట్ చేయాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తోందని చెప్పారు.మహిళలందరికీ సోద రుడిలా అండగా ఉంటానని భరోసా ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment