మా సొంత రాష్ట్రం ఒడిశా అయినప్పటికీ తండ్రి ఉద్యోగరిత్యా ఎ.కె పట్నాయక్ ఇండియన్ అడిట్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వహిస్తుండడంతో ఢిల్లీలో ఉంటున్నారు. తల్లి మంజుశ్రీ ఉపాధ్యాయురాలు. నా విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగింది. ఎం.ఏ.ఎకనామిక్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్‌లో ఏడాదిపాటు జాబ్ చేశాను. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ఒకవైపు జాబ్ చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమవుతూ వచ్చా. అనంతరం కలెక్టర్ అయ్యాను. మా సోదరి అర్పిత పీహెచ్‌డీ ఎకనామిక్స్ చదివి యూఎస్‌లో ఉంటుంది.
వివక్షను రూపుమాపుతాం
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మహిళలు ఉద్యోగులుగా ఉండడంతో లింగ వివక్షతకు ఆస్కారం లేకుండా చేస్తున్నాం. ఉద్యోగులు విధులు నిర్వహించే కార్యాలయాల్లో గౌరవం కల్పిస్తున్నాం. లింగ వివక్షతపై ఎస్పీ యోగేష్ గౌతమ్‌తో సమీక్షలు జరుపుతున్నాం. ఐసీడీఎస్, సఖి, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. న్యాయపరంగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం. మహిళలు ఏదైనా సహాయం అడిగితే వెంటనే స్పందిస్తున్నాం. అలాగే, మహిళల్లో రక్తహీనత ఉన్నవారిని గుర్తించి వారికి కావాల్సిన మందులను అందజేస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ మహిళా డాక్టర్లచే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి మహిళల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment