మహిళా సాధికారతే లక్ష్యం
నారాయణపేట: ‘మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహిళామణుల స్ఫూర్తితో మహిళా సాధికారత కోసం ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. మొదటిది.. లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండు.. మహిళలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మూడు.. మహిళలకు భద్రత, ఆరోగ్య సంరక్షణ పెంపొందించడం. నాలుగు.. మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించడం. ఐదు.. రాజకీయాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడం. ఈ లక్ష్యాలతో ముందుకు సాగాలని’.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ సిక్తాపట్నాయక్
మా సొంత రాష్ట్రమైన ఒడిశాలో మహిళలు ఎక్కువశాతం నిరక్షరాస్యులే. వారిలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ఇక తెలంగాణలో మహిళలు ఎంతో ముందున్నారు. చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు రాణించాలి.
చైతన్యం ఎక్కువే
నారాయణపేట
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment