No Headline
మహబూబ్‌నగర్ క్రీడలు: కోయిలకొండ మండలం కేశ్వాపూర్ పెద్దతండాకు చెందిన అక్కా, చెల్లెలు కె.జ్యోతి, కె.ప్రియాంక బాస్కెట్‌బాల్‌లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అక్క జ్యోతి 12 సార్లు జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2015లో పంజాబ్‌లో జరిగిన జూనియర్ నేషనల్, వరంగల్‌లో జరిగిన జాతీయ ఆర్‌జీకేఏ బాస్కెట్‌బాల్ టోర్నీలో పాల్గొంది. 2016లో కర్ణాటకలో జరిగిన యూత్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జూనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ తరఫున ఆడిన జ్యోతి ఆ తర్వాత హైదరాబాద్, లుథియానా, ఢిల్లీ, చైన్నెలో జరిగి పలు జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చూపారు. అలాగే 25కు పైగా రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాలమూరు జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. గుజరాత్ రాష్ట్రం భావ్‌నగర్‌లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పాల్గొని, తెలంగాణ జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చెల్లి ప్రియాంక 2014లో ఖమ్మంలో తన తొలి రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 25కుపైగా రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంది. అక్క జ్యోతితో కలిసి పలు సార్లు రాష్ట్రస్థాయి టోర్నీలో ఆడింది. మూడు సార్లు జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంది. 2017 ఢిల్లీలో జరిగిన ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి టోర్నీలో తొలిసారిగా తెలంగాణ తరఫున బరిలోకి దిగారు. అలాగే 2019 ఢిల్లీలో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నీలో ఆడింది. అండర్–23 విభాగంలో నేషనల్ బాస్కెట్‌బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికై ంది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో వీరు హైదరాబాద్‌లోని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు.
గిరిజన బిడ్డలు... బాస్కెట్‌బాల్‌లో దిట్టలు
రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అక్కాచెల్లెలు
అతివకు అందలం
అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం
ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై
‘సాక్షి’ డిబేట్
Comments
Please login to add a commentAdd a comment