మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ముసాయిదాను సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రివర్గం ఆమోదించి చట్టం చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్ అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినోద్‌కుమార్, సింగిరెడ్డి పరమేశ్వర్, రాయికంటి రాందాస్, మీసాల రాము పాల్గొన్నారు.
రవాణాశాఖ మంత్రికి కృతజ్ఞతలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఒక గంట ముందు ఇంటికెళ్లే వెసులుబాటును అమలు చేయాల్సిందిగా ఆల్‌మేవా ఆధ్వర్యంలో ఇటీవలే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఎండీలకు వినతిపత్రాలు పంపించినట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫారుఖ్ హుస్సేన్, సయ్యద్ వహీద్‌షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని మహబూబ్‌నగర్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కోరారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ విజయేందర బోయికి వినతి పత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment