నారాయణపేట: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జి.జగదీష్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి సలీం మాట్లాడుతూ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు అహంకారం తగ్గలేదని, దళితులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి మద్దతుగా వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ మాజీ మంత్రిని, బీఆర్‌ఎస్ నాయకులను తిరగనియ్యకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కోట్ల మధుసూదన్‌రెడ్డి, మహేష్, సతీష్ గౌడ్, రమేష్,సూర్యకాంత్, రాజేష్, శరణప్ప, మహిముద్ ఖురేషి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.