నారాయణ్‌పుర్ - దంతెవాడ సరిహద్దులో శుక్రవారం పోలీసుల జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 40 మంది మరణించగా.. పోలీసులు మాత్రం 31మంది మావోయిస్టులు మృతి చెందినట్లు వెల్లడించారు.అయితే, మిగిలిన తొమ్మిది మంది ఎవరనేది చెప్పే ప్రయత్నం చేయలేదు పోలీసులు. పైగా ఆ తొమ్మది మంది మృతదేహాల్ని ఎవరివి అనేది దృవీకరించలేదు.
ఇక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మహిళ మావోయిస్టులలో దళ కమాండర్ ఒకరు మరణించినట్లు ధ్రువీకరించారు. మహారాష్ట్ర నుండి 150 మంది మహిళ పోలీస్ కమాండోలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారు. మృతి చెందిన 31 మంది మావోయిస్టులపై సుమారు కోటి రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment