ఐదేళ్ల బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది.... | 5 Year Old Girl Gives New Lease Of Life To Four | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ఇచ్చింది....

Published Wed, Dec 29 2021 8:45 PM | Last Updated on Wed, Dec 29 2021 8:49 PM

5 Year Old Girl Gives New Lease Of Life To Four - Sakshi

5-Year-Old Girl Gives New Lease Of Life To Four: చండీఘడ్‌లోని ఐదేళ్ల బాలిక బ్రైయిన్‌ డెడ్‌ అయ్యి చనిపోయింది. అయితే ఆ బాధను దిగమింగుకుని మరి తల్లిదండ్రులు అవయదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ బాలిక నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అయితే ఆ బాలిక డిసెంబర్‌ 22న ఎత్తు నుండి పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వారం రోజులు ఆసుపత్రిలో ప్రాణల కోసం పోరాడి చనిపోయింది.

(చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!)

ఈ చిన్నారి ప్రాణాలతో బయటపడదని గ్రహించిన పీజీమర్‌ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటర్లు ఆ చిన్నారి తండ్రిని సంప్రదించారు. అయితే ఆ తండ్రి ఎంతో గుండె నిర్భారాన్ని ప్రదర్శించి అవయదానానికి అంగీకరించారు. ఈ క్రమంలో ఆ బాలిక శరీరం నుంచి  గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్‌ వంటి అవయవాలను తీసుకున్నారు. దీంతో ముంబై, ఢిల్లీలో ఒక్కొక్కరు చండీఘడ్‌లోని ఇద్దరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ క్రమంలో పీజీమర్‌  డైరెక్టర్ ప్రొఫెసర్ సుర్జీత్ సింగ్ ఎంతో ధైర్యంతో ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన ఆ బాలిక కుటుంబాన్ని ప్రశంసించడమే కాక ఇలాంటి చైతన్యం ఎందరో రోగుల ఆశాకిరణాన్ని నిలబెట్టడానికి దోహదడుతుందని అన్నారు.

(చదవండి: వికటించిన పెడిక్యూర్‌.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement