
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శుక్రవారం తెల్లవారుజామున అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఓ డ్రోన్ సంచరించింది. పాక్ వైపు నుంచి వచ్చిన ఈ డ్రోన్ జమ్మత్ పోస్టు వద్ద సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించింది. పాక్ భూభాగం వైపు ఫెన్సింగుకు అవతల దీన్ని చూసిన బీఎస్ఎఫ్ జవాన్లు డ్రోన్‌పై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయింది. అయితే డ్రోన్ ద్వారా రెక్కీ నిర్వహిస్తున్నట్టుగా భారత బలగాలు భావిస్తున్నాయి.
కాగా జమ్మూ ఎయిర్‌పోర్టులోని ఐఏఎఫ్ ఎయిర్ బేస్ వద్ద జూన్ 27న డ్రోన్లతో దాడి జరిగిన అనంతరం మళ్లీ డ్రోన్లు సంచరిస్తుండం ఆందోళన రేపుతోంది. జమ్ములో డ్రోన్లు కనపడడం ఇది అయిదో సారి. దీంతో ఇప్పటికే అప్రమత్తమైన భారత సైన్యం పాక్ డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడకుండా మిలిటరీ కేంద్రాల వద్ద యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసింది.
చదవండి: విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరాబాద్‌కూ ముప్పు!
Comments
Please login to add a commentAdd a comment