సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల భారీ తగ్గింపుతో ఊరట ఇచ్చిన కేంద్రం.. నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్ సంకేతాలు అందించింది. సిమెంట్ ధరలను భారీగా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు శనివారం సాయంత్రం కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటనలో తెలిపారు.
సిమెంట్ లభ్యతను మెరుగుపరచడంతోపాటు మెరుగైన లాజిస్టిక్స్ ద్వారా సిమెంట్ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
అలాగే దిగుమతి ఆధారిత ఎక్కువగా ఉన్న.. ప్లాస్టిక్ ఉత్పత్తులకు ముడి పదార్థాలు మధ్యవర్తులపై కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మరోవైపు ఐరన్, స్టీల్‌పైనా.. సంబంధిత కొన్ని ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించినట్లు తెలిపారు. అయితే కొన్ని ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించబడుతుందని ఆమె స్పష్టం చేశారు.
Measures are being taken up to improve the availability of Cement and through better logistics to reduce the cost of cement: Union Finance Minister Nirmala Sitharaman
— ANI (@ANI) May 21, 2022
Comments
Please login to add a commentAdd a comment