న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ సమీక్షించారు. హైకోర్టుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆయన ఆరా తీశారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ సమీక్షా సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. కోర్టుల్లో పోస్టుల భర్తీని వేగవంతం చేయాల్సి ఉందని జూన్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ వర్చువల్ సమావేశాల్లో ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో న్యాయం అందించడంలో జరుగుతున్న జా ప్యానికి మౌలిక వసతుల లేమి, డిజిటల్ డివైడ్‌లు ప్రధాన కారణమన్నారు. దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంతో ఆధునిక కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ‘నేషనల్ జ్యూడిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలని జస్టిస్ రమణ సూచించారు. ప్రస్తుతం 25 హైకోర్టుల్లో 1,080 మందికి గానూ 660 మంది జడ్జీలే ఉన్నారని న్యాయ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment