
సాక్షి, బెంగళూరు: సీఎల్పీ నేత సిద్ధరామయ్య ఇటీవల కొడగు పర్యటనలో మాంసాహారం తీసుకొని దేవస్థానానికి వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. మడికెరిలో మాజీ ఎమ్మెల్యే వీణా అచ్చయ్య ఇంట్లో నాటు కోడి కూర, రాగి ముద్ద భోజనం ఆరగించి ఆ సాయంత్రమే కొడ్లిపేటలో ఉన్న బసవేశ్వర దేవస్థానానికి వెళ్లి దర్శించుకున్నారు.
గతంలోనూ సిద్ధరామయ్య చేపల కూర తిని ధర్మస్థలకు వెళ్లారనే వివాదంలో చిక్కుకున్నారు. ఇందులో తప్పేముందని సిద్ధరామయ్య ఆదివారం చిక్కబళ్లాపురలో ప్రశ్నించారు. ఒక్కరోజు ముందు మాంసాహారం తిని మరుసటి రోజు ఆలయానికి వెళ్తే తప్పు కాదా అని అన్నారు.
చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..)