‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’ | CM Arvind Kejriwal Appealed to People not to Burst Firecrackers | Sakshi
Sakshi News home page

‘టపాసులు కాల్చం, లక్ష్మీ పూజ చేసుకుంటాం’

Published Thu, Nov 5 2020 5:19 PM | Last Updated on Thu, Nov 5 2020 6:04 PM

CM Arvind Kejriwal Appealed to People not to Burst Firecrackers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌, కాలుష్యం నేపథ్యంలో దీపావళి నాడు ప్రజలు ఎవరు కూడా టపాసులు కాల్చవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. దీపావళి పండుగరోజు రాత్రి 7.39 గంటలకు ప్రభుత్వం లక్ష్మి పూజ నిర్వహిస్తోందని మంత్రులతో పాటు ప్రజలు కూడా ఆ వేడుకలలో పాల్గొనాలని కోరారు. ఢిల్లీ ప్రస్తుతం రెండు సమస్యలతో బాధపడుతుందని ఒకటి కరోనా అయితే మరొకటి వాయు కాలుష్యం అని అన్నారు. దీపావళికి టపాసులు కాల్చడం ద్వారా వాయు కాలుష్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని అందుకే ప్రజలు ఎవరూ ఆ పని చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, ‘ మేమందరం ఈ దీపావళిని కలిసి జరుపుకుంటాం. అయితే ఎవరం టపాసులు కాల్చం. ఇక్కడ మంచి వాతావరణంలో రెండు కోట్లమందికి మేలు జరగాలనే ఉద్దేశ్యంతో లక్ష్మి పూజ నిర్వహిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరగడానికి కూడా ఈ వాయు కాలుష్యం ఒక కారణమన్నారు. ఇప్పటికే కాలుష్యంతో ఢిల్లీ అల్లాడుతోందని అందుకే టపాసులు కాల్చవద్దని, అందరం కలిసి పూజ చేసుకుందామని సీఎం కోరారు. ఇదిలా వుండగా పశ్చిమ బెంగాల్‌ ఈ ఏడాది బాణాసంచా అమ్మకాలను నిషేధించారు. చదవండి: ఢిల్లీని వణికిస్తున్న కరోనా ‘థ‌ర్డ్ వేవ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement