
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు 45వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కేసుల సంఖ్యపరంగా తాజాగా మరో రికార్డు నమోదైంది. గత 24 గంటల్లో(బుధవారం నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు) 52,123 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు ఒక్క రోజులో 50వేలు దాటడం ఇదే తొలిసారి.
(చదవండి: అంబులెన్స్ .. మృతదేహమైతే లక్ష డిమాండ్)
ఇక కరోనా బారిన పడి గత 24 గంటల్లో 775 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 15,83,792 లక్షలకు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 34,968కి పెరిగింది. రికవరీ కేసులు కూడా భారీగా ఉండడం కొంత ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా రికవరీ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. గురువారం నాటికి 10,20,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 32,553 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 64.44 శాతం, మరణాల రేటు 2.21 శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,28,242 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment