న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మరి కారణంగా భాదపడుతున్న భాదితుల కోసం టెక్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దేశంలో భారీగా కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలలో పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతకు సంబందించిన స్థానిక సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ను అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి టెక్ దిగ్గజం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
"ప్రజలు కీలకమైన సమాచారమైన ఆసుపత్రిలలో పడకలు, వైద్య ఆక్సిజన్‌కు లభ్యత వెతుకుతున్న విషయం మాకు తెలుసు. ఆ విషయంలో సమాధానాలను తేలికగా కనుగొనడంలో వారికి సహాయపడటానికి, మ్యాప్‌లలోని Q & A అనే ఫంక్షన్‌ను ఉపయోగించి కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాము. స్థానిక ప్రదేశాలలోని పడకలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది" అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment