సిక్కింలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో కడుపు నొప్పితో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంటే.. నొప్పి తగ్గకపోగా.. ఎక్కువైంది. మళ్లీ ఏ ఆసుపత్రిలో చూపించుకున్నా ప్రయోజనం లేకపోయింది. అలా 12 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూనే ఉంది. తాజాగా ఈనెలలో మరోసారి ఆసుపత్రికి వెళ్లగా.. కడుపు నొప్పికి గల కారణం తెలిసి కుటుంబం షాక్‌కు గురైంది. సదరు మహిళ కడుపులో గత 12ఏళ్లుగా కత్తెర ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
అసలేం జరిగిదంటే.. 45 ఏళ్ల మహిళ 2012లో గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మెమోరియల్ హాస్పిటల్‌లో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. ఈ తరువాత ఊడా ఆమెకు కడుపులో నొప్పి కొనసాగుతూనే ఉంది. చాలా మంది వైద్యులను సంప్రదించి మందులు ఇచ్చినప్పటికీ నొప్పి తగ్గలేదు. తిరిగి వస్తూనే ఉంది. ఇలా పదేళ్లకుపైగా బాధపడుతూనే ఉంది. అక్టోబర్ 8న, ఆమె మళ్లీ ఎస్టీఎన్‌ఎమ్ ఆసుపత్రికి వెళ్లింది. ఎక్స్-రేలో ఆమె కడుపులో శస్త్రచికిత్స కత్తెర ఉన్నట్లు బయటపడింది. 12 క్రితం అపెండిక్స్ ఆపరేషన్ చేసుకున్న సమయంలో వైద్యులు ఆమె కడపులో ఓ కత్తెరను పెట్టి మర్చిపోయినట్లు తేలింది.
అయితే ఇన్నేళ్లుగా డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర ఉందన్న విషయం కనిపెట్టలేకపోవడం గమనార్హం. తాజాగా వైద్య నిపుణుల బృందం వెంటనే మళ్లీ ఆమెకు ఆపరేషన్ చేసి కత్తెరను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే విషయం బయటకు పొక్కడంతో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ.. హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment