Pune Drunk Girl News: Girl Sleeps On Road, Blocks Traffic - Sakshi
Sakshi News home page

మందేసిన మగువ.. రోడ్డుపై యోగా.. పోలీసులు వచ్చేసరికే..!

Published Wed, Aug 4 2021 4:22 PM | Last Updated on Wed, Aug 4 2021 6:16 PM

A Drunk Woman Blocks Traffic And Sleep On Road In Pune Video Goes Viral - Sakshi

కొందరు మందేస్తే చిందేస్తారు. మరికొందరు ఇతరులపై చిందులేస్తారు. వీటిల్లో మొదటిది వినోదం పంచితే.. రెండోది చిరాకు తెప్పిస్తుంది. ఏ పని చేసిన అతిగా చేస్తే.. అసలుకే మోసం వస్తుంది. అది మందైనా.. మనసు పడిన మరేదైనా.. ఆ విషయం అనుభవజ్ఞులకు బాగా తెలుసు.

ముంబై: మద్యం తాగిన ఓ యువతి పుణేలోని తిలక్‌ రోడ్డుపై పడుకుని రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. హీరాబాగ్ చౌక్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్వర్గేట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫోన్‌ రావడంతో.. అక్కడికి వెళ్లే సరికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. కాగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ కిక్కు ఎక్కింది. రోడ్డెక్కి తిక్క తిక్కగా చేసింది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘లిక్కరేశాక నడిచి వెళ్తే ఏం కిక్కు.. అందుకే ఇలా వెరైటీగా ట్రై చేయాలి.’’ అంటూ చమత్కరించాడు. ఇక మరో నెటిజన్‌ ‘‘ఆమె మందేసిందో.. మాససిన స్థితి బాగోలేదో.. చూడండయ్యా’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement