చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి.. | A Four Men Severely Thrashed A Fish Seller Gouged Out His Eyes And Then Threw him Roof Of A Two Storey House | Sakshi
Sakshi News home page

చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..

Published Sat, Nov 13 2021 10:52 AM | Last Updated on Sat, Nov 13 2021 11:59 AM

A Four Men Severely Thrashed A Fish Seller Gouged Out His Eyes And Then Threw him Roof Of A Two Storey House - Sakshi

డెహ్రాడూన్‌: ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న విషయాలు హత్యలకు దారి తీస్తున్నాయి.  తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో  చేపలు ఉచితంగా ఇవ్వలేదని ఒక వ్యక్తిపై పైశాచికంగా దాడి చేసి హత్యకు కారణమయ్యారు కొందరు దుండగులు.

(చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ!)

అసలు విషయంలోకెళ్లితే...ఉత్తరాఖండ్‌లో నైనిటాల్ జిల్లాలోని టోక్ నర్టోలా గ్రామంలో భగవాన్ సింగ్ పడియార్ చేపలు అమ్మేవాడు. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో నలుగురు స్థానికులు చేపల కొనుగోలు చేయడం కోసం అతని దుకాణానికి వచ్చారు. అయితే వారు చేపలను ఉచితంగా ఇమ్మంటూ గొడవ చేశారు. అందుకు చేపలమ్మే వ్యక్తి అంగీకరించకపోవడంతో ఆ నలుగురు వ్యక్తులు భగవాన్‌పై కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్‌తో అతని కళ్లను కోశారు.

ఆ తర్వాత అతన్ని రెండంతస్తుల ఇంటి పైకప్పు పైకి లాగి కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు స్థానికులు భగవాన్‌ను చికిత్స నిమిత్తం హల్ద్వానీలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. కానీ భగవానం ఆసుపత్రిలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడతూ చివరికి మరణించాడు. ఆ తర్వాత బాధితుడి మేనమామ గణేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తదనంతరం పోలీసులు నిందుతులు శల్ సింగ్, సునీల్ జోషి, భూపాల్ సింగ్, చంచల్ సింగ్‌లుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఇదే తరహాలో మహారాష్ట్రలో నాగాపూర్‌లోని రెస్టారెంట్‌లో​ చికెన్‌ సరిగా వడ్డించలేదంటూ గొడవ చేసి రెస్టారెంట్‌కి నిప్పంటించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం. 

(చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్‌ జ్వరాలు!!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement