Four Men
-
చేపలు ఉచితంగా ఇవ్వలేదని... తీవ్రంగా కొట్టి కళ్లుపీకి చివరికి..
డెహ్రాడూన్: ఇటీవల కాలంలో చాలా చిన్న చిన్న విషయాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో చేపలు ఉచితంగా ఇవ్వలేదని ఒక వ్యక్తిపై పైశాచికంగా దాడి చేసి హత్యకు కారణమయ్యారు కొందరు దుండగులు. (చదవండి: 89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!) అసలు విషయంలోకెళ్లితే...ఉత్తరాఖండ్‌లో నైనిటాల్ జిల్లాలోని టోక్ నర్టోలా గ్రామంలో భగవాన్ సింగ్ పడియార్ చేపలు అమ్మేవాడు. అయితే రాత్రి 7 గంటల ప్రాంతంలో నలుగురు స్థానికులు చేపల కొనుగోలు చేయడం కోసం అతని దుకాణానికి వచ్చారు. అయితే వారు చేపలను ఉచితంగా ఇమ్మంటూ గొడవ చేశారు. అందుకు చేపలమ్మే వ్యక్తి అంగీకరించకపోవడంతో ఆ నలుగురు వ్యక్తులు భగవాన్‌పై కిరాతకంగా దాడి చేసి స్టీల్ రాడ్‌తో అతని కళ్లను కోశారు. ఆ తర్వాత అతన్ని రెండంతస్తుల ఇంటి పైకప్పు పైకి లాగి కిందకు తోసేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ మేరకు స్థానికులు భగవాన్ను చికిత్స నిమిత్తం హల్ద్వానీలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కానీ భగవానం ఆసుపత్రిలో వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడతూ చివరికి మరణించాడు. ఆ తర్వాత బాధితుడి మేనమామ గణేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తదనంతరం పోలీసులు నిందుతులు శల్ సింగ్, సునీల్ జోషి, భూపాల్ సింగ్, చంచల్ సింగ్‌లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఇదే తరహాలో మహారాష్ట్రలో నాగాపూర్‌లోని రెస్టారెంట్లో చికెన్ సరిగా వడ్డించలేదంటూ గొడవ చేసి రెస్టారెంట్‌కి నిప్పంటించిన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదం. (చదవండి: కరాచీలో అంతుపట్టని వైరల్ జ్వరాలు!!) -
నలుగురు అరెస్టు
పుట్లూరు : మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. రవి, నాగభూషణంతో పాటు మరో ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. -
హత్య కేసులో నలుగురి అరెస్టు
ధర్మవరం అర్బన్: బైక్‌తో ఢీకొట్టాడనే అక్కసుతో స్కూటరిస్టును చితకబాది ఆ తరువాత హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. వాటి వివరాలను ఆయన విలేకరులకు బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... ధర్మవరంలోని మహాత్మగాంధీ కాలనీకి చెందిన సాకే నరసింహులు, వడ్డే గోగుల రమేశ్, గొల్లవాండ్లపల్లికి చెందిన గొల్ల లక్ష్మినారాయణ, మోటుమర్ల గ్రామానికి చెందిన బోయకనుమ మల్లికార్జున స్నేహితులు. ఈ నెల ఒకటిన రాత్రి మద్యం తాగి లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో తిరుగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన చిన్న కదిరప్ప టీవీఎస్‌లో వస్తూ నరసింహులు అనే వ్యక్తిని ఢీకొన్నాడు. దీంతో ఆగ్రహించిన నరసింహులు కదిరప్పను తిట్టాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో చివరకు పైన పేర్కొన్న నలుగురూ కలసి కదిరప్పను చితకబాదారు. అంతటితో ఆగక అతని టీవీఎస్‌లోనే బలవంతంగా రైల్వేట్రాక్ వద్దనున్న బీడు భూమిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అనంతరం కదిరప్పను తీసుకొచ్చి లక్ష్మిచెన్నకేశవపురంలోని కరుణాకర్ జనరల్ స్టోర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 2వతేదిన ఆదివారం తెల్లవారుజామున జనరల్ స్టోర్ నిర్వాహకుడు కరుణాకర్ తీవ్రగాయాలతో ఉన్న కదిరప్పను గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ వచ్చేలోపు కదిరప్ప మృతి చెందాడు. 4న నిందితులు వీఆర్ఓ రాజశేఖర్ ఎదుట హాజరై నేరం అంగీకరించారు. వారిని సీఐ ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత అరెస్టు చూపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు ఆదేశించారు. -
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ములాయం తనదైన శైలిలో కొత్త భాష్యం చెప్పారు. ఒక మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు, అదంతా బూటకమంటూ వ్యాఖ్యానించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే దాన్ని మిగిలిన పురుషులకు ఆపాదిస్తున్నారని ములాయం పేర్కొన్నారు. అసలు నలుగురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేయడం అసాధ్యమంటూ తన మాటలను మరింత సమర్ధించుకున్నారు. ఇలాంటి కేసులు తాను చాలా చూశాననీ, ఇక ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే... అతని సోదరులను కేసులో ఇరుకిస్తున్నారు తప్ప, అసలు గ్యాంగ్ రేప్‌లు లేవన్నట్టుగా ములాయం చెప్పుకొచ్చారు. యూపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, పెరుగుతున్న హింసపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో నేరాల సంఖ్య తక్కువని, తక్కువ రేప్‌లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయి తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని సమర్థించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నేరంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదంటూ కుమారుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. దీంతో ములాయం వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా మహిళలు, అత్యాచారాలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ములాయంకు కొత్తేమీ కాదు. ఇదే మొదటిసారి అంతకన్నా కాదు.. ఏదో మగపిల్లలు సరదా పడతారు. ..తప్పు చేస్తారంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తే ఉరి తీస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ములాయం వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
మహిళను నలుగురు ఎలా రేప్ చేస్తారు?
-
పాక్ ఉగ్రవాదికి సహకరించిన నలుగురి అరెస్టు
శ్రీనగర్ : ఈనెల 5న జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడి కి సహకరించిన నలుగురు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. ఉధంపూర్‌లో దాడి చేసిన ఇద్దరు పాక్ ఉగ్రవాదుల్లో మహమ్మద్ నవేద్‌ను పట్టుకోవడం తెలిసిందే. నవేద్‌కు ఈ దాడిలో స్థానికంగా ఎవరు సహకరించారో తెలుసుకోవడానికి అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు జమ్మూ ప్రాంతం నుంచి కశ్మీర్‌లోయ ప్రాంతానికి తీసుకువచ్చారు. పుల్వామా జిల్లాలో తనకు సహకరించిన నలుగురు వ్యక్తుల గురించి నవేద్ సమాచారం ఇవ్వడంతో వారిని అరెస్టు చేశారు. ఈ నలుగురు కశ్మీర్లో లష్కరే సంస్థ స్లీపర్‌సెల్‌లో సభ్యులని నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదిని పట్టుకున్నవారికి నగదు బహుమతి నవేద్‌ను పట్టుకున్న ఇద్దరు యువకులను జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ ‘పాంథర్స్ సాహస అవార్డు’తో సత్కరించింది. జమ్మూలో విక్రంజిత్, రాకేశ్‌లకు చెరో రూ.21వేలను పార్టీ నేత బల్వంత్ సింగ్ అందజేశారు. ఎదురు కాల్పులు.. కాగా పాక్ సరిహద్దుల్లోని అధీనరేఖ వద్ద తాంగ్ధర్ సమీపంలో శనివారం సైనిక దళాలు కొంతమంది మిలిటెంట్లను అడ్డుకున్నాయి. మిలిటెంట్లను సైనికదళాలు హెచ్చరించడంతో వారు కాల్పులు జరిపారని, దాంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని ఆర్మీ తెలిపింది. -
నలుగురు కలిసి ఒక వ్యక్తిపై దాడి