యశవంతపుర (కర్ణాటక): దేశంలో 2024 నాటికి మనదేశంలో అమెరికా మాదిరిగా రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. సోమవారం బెళగావిలో.. రాష్ట్రంలో 19 వేల కోట్ల అంచనాలతో 46 జాతీయ రహదారులను 1,328 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసే పనులను ఆయన ప్రారంభించారు.
భారత మాలా–2 యోజనలో అనేక రోడ్ల అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పుడు ఢిల్లీ–ముంబైల మధ్య 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 12 గంటలలో గమ్యం చేరుకోవచ్చన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ నియంత్రణకు హైవేలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఎం బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు.
చదవండి: (ఆపరేషన్ గంగాకి మోదీ పిలుపు..ముమ్మరంగా తరలింపు చర్యలు!)
Comments
Please login to add a commentAdd a comment