
బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎల్‌ఏడీ) నిధి నుంచి రూ.100 కోట్లను కోవిడ్ టీకా కొనుగోలుకు ఉపయోగి స్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ శాసనసభాపక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు టీకా కూడా ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. అందుకే, రాష్ట్రంలోని తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి దాదాపు 95 మంది కనీసం రూ.కోటి ఎల్‌ఏడీ నిధులను టీకా కొనుగోలుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment