
దొడ్డబళ్లాపురం: కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆపదలో ఉన్నవారికి ఆదుకోవాల్సిన సమయంలో ఓ ఎస్సై బాధ్యత మరిచి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే బర్త్‌డే వేడుకలు చేసుకోవడం విమర్శల పాలైంది. హొసకోట పీఎస్‌లో ఎస్సైగా పనిచేసే రాజుకి సీఐగా పదోన్నతి వచ్చింది. దీనికి తోడు ఆయన పుట్టినరోజు కావడంతో కొందరు పోలీసులు, ఆయన మిత్రులు బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. పోలీస్‌స్టేషన్ ముందు టపాసులు కాల్చి డ్యాన్సులు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చాయి.
చదవండి: హారిక మృతి కేసు. విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్