తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో వరుసగా మూడో రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు, శుక్రవారం 32,801 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,70,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. టెస్టు పాజిటివిటీ రేటు ఏకంగా 19.22 శాతం నమోదైంది. శుక్రవారం దేశంలో మొత్తం 44,658 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 32 వేలకు పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం గమనార్హం.మొత్తం కేసుల్లో 73.45శాతం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా?
ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేరళలో నమోదవుతున్న కేసులు దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో శుక్రవారం 44,658 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,03,188కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.03 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,36,861కు చేరుకుంది. చదవండి: Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా..
Comments
Please login to add a commentAdd a comment