భోపాల్: గ్రామంలో సర్పంచ్ పదవి చేపట్టాలంటే ఎన్నికలు జరిపి ఓటర్లు ఎన్నుకోవాలన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఎక్కడ సర్పంచ్ ఎన్నికలు జరిగిన ఇదే తంతు నడుస్తుతుంది. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా తమ సర్పంచ్‌ని ఎన్నుకున్న పద్ధతిని వింటే షాక్ అవుతారు. వాళ్లు ఓట్లతో కాదు నోట్లతో తమ సర్పంచ్‌ని ఎన్నుకున్నారు. ఎలా అంటారా?
వివరాల్లోకి వెళ్తే.. అశోక్ నగర్ జిల్లా భతౌలి గ్రామ పంచాయతీ ప్రజలు డిసెంబరు 14న, రాధా-కృష్ణ దేవాలయంలో సమావేశాన్ని నిర్వహించారు, అక్కడ కొత్తగా గ్రామ సర్పంచ్‌ని ఎంపిక చేసేందుకు వేలం పాటను నిర్వహించారు. వినడానికి వెరైటీగా ఉన్నా ఇది నిజమేనండి. కాగా ఈ వేలం పాటలో మొత్తం ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు. చివరకు సౌభాగ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేలం పాటలో గెలిచి పదవిని చేజెక్కించుకున్నాడు. వేలం పాటు రూ.21 లక్షలతో వేలం ప్రారంభం కాగా చివరకు రూ.44 లక్షల వరకు చేరింది.
నిబంధనలు ప్రకారం ఎన్నికల సమయానికి సౌభాగ్ సింగ్ అంత మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. కారణం ఏదైనా అతను డబ్బును సమకూర్చలేకుంటే.. అతని తర్వాత వేలం పాటలో ఎక్కువ పాడిన వ్యక్తిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటారు. గ్రామస్తులు ఇలా చేస్తుంటే అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఎన్నికైనా వాళ్లకే తాము సర్పంచ్‌గా గుర్తిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment