అధికారులు, నేతల మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. అది చర్చనీయాంశంగా మారడం సహజం. కానీ, అందుకు విరుద్ధంగా ఓ రాజకీయ నాయకుడు అవినీతిని ప్రొత్సహించేలా మాట్లాడడమే ఇక్కడ విశేషం. దీంతో ఆయన్ని తిట్టిపోస్తున్నారు.
మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా.. తాజాగా రేవాలో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో అవినీతి గురించి షాకింగ్ కామెంట్లు చేశాడు. ఎవరైనా వ్యక్తిగతంగా 15 లక్షల రూపాయల దాకా అవినీతికి పాల్పడడం సరైందేనంటూ వ్యాఖ్యానించాడాయన. చాలామంది నా దగ్గరికొచ్చి మా సర్పంచ్ అవినీతికి పాల్పడుతున్నారంటూ చెప్తుంటారు. అప్పుడు నేను ఆ సర్పంచ్ చేసిన అవినీతి 15 లక్షలలోపు ఉంటే నా దగ్గరికి రాకండయ్యా అని అంటాను.
...When people accuse sarpanch of corruption, I jokingly tell them that if corruption is up to Rs 15 lakhs don't come to me...come only if it's (corruption) beyond Rs 15 lakhs: BJP MP Janaradan Mishra in Rewa, Madhya Pradesh (27.12) pic.twitter.com/ImobGWecBH
— ANI (@ANI) December 28, 2021
ఎందుకంటే ఆ సర్పంచ్ ఎన్నికల కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసి ఉంటారు. మరో 7 లక్షలు వచ్చే ఎన్నికల కోసం కేటాయిస్తారు. మరో లక్ష అదనం. ఆ లెక్కలే అంత. అంతకు మించి అవినీతికి పాల్పడితే అది వేరే పరిస్థితి అంటూ మిశ్రా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్లకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. పంచాయితీ ఎలక్షన్ ర్యాలీలోనే ఆయన ఈ కామెంట్లు చేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment