విజయపుర: ఆకలిగొన్న కోతులకు మద్యం, నీటి ప్యాకెట్లు కంటపడ్డాయి. అంతే ఆలస్యం చేయకుండా వెంటనే వాటిని చేజిక్కించుకున్న వానరాలు వాటిని జుర్రుకొన్నాయి. ఈ ఘటన బెంగళూరు రూరల్ విజయపుర పట్టణంలో జరిగింది. బయట తిరుగాడుతున్న కోతులకు ఒక బార్ ముందు పడేసిన మద్యం ప్యాకెట్లు, నీటి పొట్లాలు కనిపించగా, వాటిలో మిగిలిఉన్న ద్రవాలను ఆస్వాదించాయి. ఈ దృశ్యాలను కొందరు మొబైల్‌ఫోన్లలో బంధించి ‘కోతుల పార్టీ’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment