
మండ్య: మృత్యువులోనూ తల్లీతనయుడు బంధాన్ని వీడలేదు. కుమారుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక తల్లి కూడా కుప్పకూలి ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటన మండ్య జిల్లా నాగమంగల తాలూకా హసహళ్లి కొప్పలు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుశాల్ (45) ఇంట్లో టీవీ చూస్తుండగా లోబీపీ కారణంగా కుప్పకూలి పడిపోయాడు. తక్షణమే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కుమారుడు లేడనే వార్తతో తల్లి లక్ష్మమ్మ(69) గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలింది.
Comments
Please login to add a commentAdd a comment