
సాక్షి, ముంబై: ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్‌లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం బయటపడింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్ధానిక నగల వ్యాపారుల్లో కలకలం రేపింది. చాముండా బులియన్ అనే జ్వువెలర్స్ కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ విభాగం ఆకస్మిక దాడి చేసింది. తనిఖీల్లో కార్యాలయం గోడలో దాచిన 19 కేజీల వెండి ఇటుకలు, రూ.10 కోట్లు నగదు బయట పడ్డాయి. ఈ ధనాన్ని అధికారులు జప్తు చేశారు. రాష్ట్ర జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులు జీఎస్టీ ఎగ్గొడుతున్న వ్యాపారులపై దాడులు చేయడం ప్రారంభించారు.
అందులో భాగంగా చాముండా బులియన్ జ్వువెలర్స్ కార్యాలయంలో దాడులు చేసినట్లు అధికారు లు తెలిపారు. ఈ కార్యాలయంలో 2019– 20లో రూ.22.83 కోట్లు, 2020–21లో రూ. 665 కోట్లు, 2022లో 1,764 కోట్లకుపైనే లావాదేవీలు జరిగాయి. దీంతో ఏటా పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలను గమనించిన జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సోదా చేయడం ప్రారంభించారు.
చదవండి👉 ఎంపీ నవనీత్‌కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్
ఈ కంపెనీకి అనేక శాఖలున్నప్పటికీ అందులో కొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని వారి దృష్టికి వచ్చింది. దీంతో దాడులు జరిపినప్పటికీ అధికారుల చేతికి ఏమి చిక్కలేదు. అయినప్పటికీ సోదా చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు కార్యాలయాన్ని క్షుణ్ణంగా గాలించగా ఓ గోడలో దాచిపెట్టిన మొత్తం ధనం బయటపడింది. దీంతో జీఎస్టీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు కొనసాగిస్తే మరింత ధనం దొరకవచ్చని అనుమానిస్తున్నారు. జీఎస్టీ, ఆదాయ పన్ను అధికారుల ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది.
35 वर्ग फुट के दफ्तर में तहखाना बनाकर छुपा रखा था करोड़ों रुपए!! pic.twitter.com/y8fNFI4Me2
— sunilkumar singh (@sunilcredible) April 23, 2022
Comments
Please login to add a commentAdd a comment