GST tax
-
టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: టానిక్ లిక్కర్ గ్రూప్స్‌పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు చేపట్టారు. వాటి అనుబంధ సంస్థలు, కార్యాలయాల్లో 11 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఏ మద్యం షాపునకు లేని వెసులుబాటు టానిక్కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో టానిక్కు ఏ4 ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్కు మాత్రమే అధికారులు కేటాయించారు. ఇది ఎక్సైజ్ పాలసీ కి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతి నోటిఫై చేయలేదని పలువురు వైన్‌షాప్ నిర్వాహకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో టానిక్కు 11 ఫ్రాంచైజ్లుఉండగా, క్యూ బై టానిక్ పేరుతో మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఏ షాప్‌కు లేని ప్రత్యేక అనుమతులు టానిక్కు ఉన్నట్టు జీఎస్టీ అధికారులు గుర్తించారు. టానిక్ గ్రూప్‌లో జీఎస్టీ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి 11 క్యూ టానిక్ సిండికేట్లు నడిపినట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంచైజీలలో ముగ్గురు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు సమాచారం. మాజీ సీఎంవో అధికారి కుమారుడు, ఎక్స్ జ్ ఉన్నతాధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించారు. ఇదీ చదవండి: Delhi: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు -
ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌ను వేరుగా చూడాలి
న్యూఢిల్లీ: గేమింగ్ పరిశ్రమను 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్లైన్ క్యాజువల్ స్కిల్ గేమింగ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ నుంచి తమను (స్కిల్ గేమింగ్/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాయి. అంతర్జాతీయంగా ప్రైజ్ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై పన్ను అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్‌తో పోలిస్తే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్ మనీ గేమింగ్ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్‌సీర్ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి. -
నిత్యవసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ.. అమలు చేయని వ్యాపారస్తులు
సాక్షి, సిటీబ్యూరో: జీఎస్టీ అమలుతో నిత్యావసరాల ధరలు తగ్గి...వినియోగదారుడిపై భారం తగ్గుతుందని భావించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీఎస్టీ అమలు నుంచి నేటి వరకు దాదాపు 210 నిత్యావసర వస్తువులపై పన్నులు తగ్గించారు. జీఎస్టీ ప్రారంభంలో పలు వస్తువులపై 28 శాతం ఉన్న పన్నును.. ప్రస్తుతం 18 శాతానికి, 18 శాతం పన్ను ఉన్న వస్తువులకు 12 శాతానికి తగ్గించారు. గతేడాది 12 శాతం పన్ను పరిధిలో వచ్చే నిత్యావసర వస్తువుల పన్నును 5 శాతానికి తగ్గించారు. కానీ వ్యాపారులు తగ్గిన పన్నుల ప్రకారం నిత్యావసర వస్తువులను విక్రయించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ►పన్ను తగ్గించినా వినియోగదారుడికి ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తగ్గిన పన్నును వ్యాపారులు ధరల్లో కలుపుకొని విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారుడికి లబ్ధి చేకూరడం లేదు. ►పన్ను తగ్గించినా ఇప్పటికే పాత ధరల్లోనే వస్తువులు మార్కెట్లో అందుబాటులో ఉంచారు. పన్నులు తగ్గినట్లు ధరలు కూడా తగ్గాయా లేదా? ధరలు యథాతథంగా వ్యాపారులు విక్రయిస్తున్నారా? అవే విషయాలను పర్యవేక్షించడానికి యాంటీ ప్రాఫెటింగ్ కమిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఈ కమిటీ పర్యవేక్షణ కొరవడటంతో పన్ను తగ్గించకుండా వస్తువులు విక్రయిస్తూ అక్రమాలకు పాలుపడుతున్నారు. 28 నుంచి 18 శాతానికి తగ్గిన పన్ను జీఎస్టీ ప్రారంభంలో 28 శాతం పన్ను రేటు ఎక్కువగా ఉన్న వస్తువులపై వ్యాపారులు, వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన ఆధారంగా జీఎస్టీ కౌన్సిల్లో చర్చించి చాలా వస్తువులకు 18 శాతం పన్ను పరిధిలోకి మార్చారు. ► గతేడాది మరికొన్ని 18–12 శాతానికి, 12–5 శాతానికి తగ్గించారు. దీని ద్వారా వినియోగదారుడికి ఎంతో ఉపశమం కలుగుతుందని భావించారు. కానీ పన్ను రేటు తగ్గిచడంతో కలిగే భారాన్ని వినియోగదారునికి బదలాయించక పోతే అది నేరంగా పరిగణించబడుతుంది. ►దీన్ని పర్యవేక్షించడానికి కమిటీలు ఏర్పాటు చేశారు. పన్ను తగ్గించడం వల్ల కలిగిన లాభాన్ని తమకు ఇవ్వడం లేదని వినియోగదారుడు వ్యాపారస్తులపై కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ►తగ్గిన పన్ను ప్రకారం ధరలు తగ్గించకుండా అసలు ధరలో కలిపేసి అమ్ముతున్నారు. దీంతో తగ్గిన జీఎస్టీ వినియోగదారుడికి అందడం లేదు. ఎక్కువ పన్ను రేటు ఉన్నప్పుడు ఉన్న ధర తక్కువ పన్ను భారాన్ని వ్యాపారస్తులు వినియోదారుడికి బదలాయించాలి. ►లేని పక్షంలో దీన్ని నేరంగా పరిగణించి వ్యతిరేక లాభం కమిటీ విచారణ జరిపి కేసులు నమోదు చేస్తోంది. -
నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ.10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు
సాక్షి, ముంబై: ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం బయటపడింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్ధానిక నగల వ్యాపారుల్లో కలకలం రేపింది. చాముండా బులియన్ అనే జ్వువెలర్స్ కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ విభాగం ఆకస్మిక దాడి చేసింది. తనిఖీల్లో కార్యాలయం గోడలో దాచిన 19 కేజీల వెండి ఇటుకలు, రూ.10 కోట్లు నగదు బయట పడ్డాయి. ఈ ధనాన్ని అధికారులు జప్తు చేశారు. రాష్ట్ర జీఎస్టీ విభాగానికి చెందిన అధికారులు జీఎస్టీ ఎగ్గొడుతున్న వ్యాపారులపై దాడులు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా చాముండా బులియన్ జ్వువెలర్స్ కార్యాలయంలో దాడులు చేసినట్లు అధికారు లు తెలిపారు. ఈ కార్యాలయంలో 2019– 20లో రూ.22.83 కోట్లు, 2020–21లో రూ. 665 కోట్లు, 2022లో 1,764 కోట్లకుపైనే లావాదేవీలు జరిగాయి. దీంతో ఏటా పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలను గమనించిన జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో సోదా చేయడం ప్రారంభించారు. చదవండి👉 ఎంపీ నవనీత్‌కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్ ఈ కంపెనీకి అనేక శాఖలున్నప్పటికీ అందులో కొన్నింటికి రిజిస్ట్రేషన్లు లేవని వారి దృష్టికి వచ్చింది. దీంతో దాడులు జరిపినప్పటికీ అధికారుల చేతికి ఏమి చిక్కలేదు. అయినప్పటికీ సోదా చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. చివరకు కార్యాలయాన్ని క్షుణ్ణంగా గాలించగా ఓ గోడలో దాచిపెట్టిన మొత్తం ధనం బయటపడింది. దీంతో జీఎస్టీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తనిఖీలు కొనసాగిస్తే మరింత ధనం దొరకవచ్చని అనుమానిస్తున్నారు. జీఎస్టీ, ఆదాయ పన్ను అధికారుల ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. 35 वर्ग फुट के दफ्तर में तहखाना बनाकर छुपा रखा था करोड़ों रुपए!! pic.twitter.com/y8fNFI4Me2 — sunilkumar singh (@sunilcredible) April 23, 2022 -
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్‌లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
సినిమా చూపిస్త మావా!
రోజువారీ సాధక బాధకాల నుంచి సగటు జీవికి ఊరటనిచ్చే ‘సినిమా’ ప్రస్తుతం ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లక ముందే యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతోపాటు కాంబో ప్యాక్, ఆర్డినరీ ప్యాక్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, నెల్లూరు : పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడికే వెళ్లి సినిమా చూడాల్సివస్తోంది. కేవలం పాప్ కార్న్, కూల్‌డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూలు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూలు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. నెల్లూరు నగరంలో 3 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అందులో ఒక్క మల్లీఫ్లెక్స్లో సగటున 6 స్కీన్లు ఉన్నాయి. ప్రతిచోటా స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసిన ఏ తినుబండారమూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50, చిన్న పాప్‌కార్న్‌కు రూ.170, కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200, స్వీట్స్ కేక్స్ రూ.80.. ఇలా 28 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ.100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అదనంగా వసూలు చేస్తున్నారు. పార్కింగ్ పేరుతో దోపిడీ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు. అయినా నిర్వాహకులు యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాల్స్‌లో ద్విచక్రవాహనానికి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ పక్కా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. న్యాయస్థానం తీర్పుతోనైనా.. మల్టీఫ్లెక్స్ థియేటర్ల దోపిడీపై గతంలో వినియోగదారుల న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వినోదం కోసం వెళ్లి వినియోగదారుడు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిరావడంపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లో దోపిడీపై ఫోరానికి వెళ్లిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇకనైనా తూనికలు, కొలతల శాఖ అధికారులు న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. నెలవారీ మామూళ్లు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో దోపిడీపై తెలంగాణ రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రతి థియేటర్ వద్ద స్నాక్స్ ఎమ్మార్పీ ధరల పట్టిక తెలుగులో రాసిన బోర్డు పెట్టాలని, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మల్టీఫ్లెక్స్ థియేటర్లలోకి అధికారులు వెళ్లే సాహసం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు దోపిడీకి గురవుతున్న వినియోగదారుడికి న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ప్రస్తుతం మహేష్ ఎక్కడ ఉన్నారంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు గురించే చర్చ జరుగుతోంది. ట్యాక్స్ కట్టలేదని ఆయన ఖాతాలను సీజ్ చేశారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇక మహేష్ అభిమానులు ఈ విషయంపై కలవరపడుతుంటే.. ఆయన మాత్రం హ్యాపీగా హ్యాలిడే ట్రిప్‌లో ఎంజాయ్‌చేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు విదేశాలకు వెళ్లిన మహేష్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. ఇక్కడేమో పన్నులు కట్టలేదనీ, ఆయన ఖాతాలను జీఎస్టీ అధికారులు సీజ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఏమాత్రం స్పందించకుండా మహేష్ సరదాగా హాలిడేను ఎంజాయ్ చేసేస్తున్నారు. జాలీగా హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న పిక్‌ను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చదవండి : మహేష్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు స్వాధీనం హీరో మహేష్‌కు ఝలక్: బ్యాంకు ఖాతాలు సీజ్ -
మహేష్‌బాబుకు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: హీరో మహేష్‌బాబుకు సంబంధించిన బ్యాంకు ఖాతాల నుంచి రూ. 42 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు జీఎస్టీ అధికారులు తెలిపారు. ఇంకా రూ. 31 లక్షలు ఆయన నుంచి రాబట్టాల్సివుందని చెప్పారు. మొత్తం రూ. 73 లక్షలు పన్ను బకాయి చెల్లించాల్సివుందన్నారు. 2007-08లో ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయానికి సర్వీసు ట్యాక్స్ చెల్లించకపోవడంతో మహేష్‌బాబు బ్యాంకు ఖాతాలను జీఎస్టీ కమిషనరేట్ జప్తు చేసింది. యాక్సిస్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 31 లక్షలు రికవరీ చేశామని, మిగతా మొత్తం ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ నుంచి స్వాధీనం చేసుకుంటామని జీఎస్టీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. పన్ను బకాయిలకు సంబంధించి 2010లో నోటీసు ఇచ్చామన్నారు. ఆయన స్పందించకపోవడంతో 2012లో ఆర్డర్ పాస్ చేశామన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేసుకున్నా ఆయనకు ఊరట లభించలేదన్నారు. ట్రైబ్యునల్ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టును మహేష్ ఆశ్రయించారు. స్టే ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆర్థిక చట్టం సెక్షన్ 87 ప్రకారం ఆయన బ్యాంకు ఖాతాలను జప్తు చేసినట్టు వివరించారు. -
గుడిలో పూజలకు, ప్రసాదాలపై జీఎస్టీ పన్ను
-
ఇక స్టార్ హీరోల చిత్రాలు కాస్టిలీ గురూ!
పెరంబూరు: సినిమా ప్రేక్షకుడిపై టికెట్ల ధరల మోతే. ఇకపై సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారు నటించిన చిత్రాలు చూడాలంటే సాధారణ ప్రేక్షకుడికి అసాధ్యం కానుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం అమలు పరచిన జీఎస్టీ పన్నుతో సినిమా టికెట్లపై 18 నుంచి 28 శాతం వరకూ భారం పడుతోంది. అంటే రూ. 120 టికెట్ రూ. 153కూ రూ. 100 టికెట్ రూ. 118కూ పెరిగిపోయింది.దీనికి తోడు రాష్ట్రప్రభుత్వం అదనంగా వినోదపు పన్నును 30 శాతం విధించడానికి సిద్ధం కావడంతో ఈ పన్నును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్ల యాజమాన్యం సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం చర్చలకు పిలుపు నివ్వడంతో థియేటర్ల మాజమాన్యం సమ్మెను విరమించకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తరఫున ఒక బృందం, సినీ పరిశ్రమ తరఫున ఒక బృందం ఏర్పాటు చేసి వినోదపు పన్ను విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు ఇదిమిద్ధంగా ఒక కొలిక్కి రాకపోయినా ప్రస్తుతం కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో సినిమా థియేటర్ల టికెట్ల విషమంలో ఒక కొత్త విధానం అమలులో ఉంది. అక్కడ స్టార్ హీరోల చిత్రాలకు వార చివరి రోజుల్లో అధిక ధరను వసూలు చేస్తున్నారు. ఇతర రోజుల్లో సాధారణ ధరలను వసూలు చేస్తున్నారు.అదే విధానాన్ని తమిళనాడులో అమలు పరచే విషయంలో రాష్ట్రప్రభుత్వానికి,చిత్ర పరిశ్రమకు చెందిన వారికి మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది.అదేవిధంగా స్టార్ హీరోలు రజనీకాంత్,కమలహాసన్, విజయ్,అజిత్ వంటి వారి చిత్రాలకు అదనంగా టికెట్ ధరను వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం చెన్నైలో టికెట్ ధరను రూ.50 నుంచి రూ.160 వరకూ నిర్ణయించినట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో రూ. 140 వరకూ వసూలు చేసుకోవచ్చని సమాచారం.ఈ ధరలకు అధనంగా రూ. 100లకు పైగా ఉన్న ధరలపై జీఎస్టీ పన్ను 28 శాతం, అందుకు తక్కువ టికెట్ ధరపై 18 శాతం పడుతుంది. ఉదాహరణకు రూ. 160 టికెట్ ధర పై 28 శాతం జీఎస్టీ పన్ను కలిపితే రూ.205 అవుతుంది.దీనికి ఆన్లైన్ బుక్కింగ్ అయితే మరో రూ.30 చార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.అంటే రూ.235 అవుతుంది. దీనికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటున్న చిత్ర పరిశ్రమకు చెందిన ఒకాయన తెలుపుతూ స్టార్స్ చిత్రాలకు టికెట్ ధర పెంచే విషయం గురించి చర్చల్లో ఆమోద ముద్ర పడినట్లు తెలిపారు.అయితే త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆ తరువాత కొత్త ధరలు అమలవుతాయని చెప్పారు.అదే విధంగా అనువాద చిత్రాలకు 10 నుంచి 15 శాతం వినోదపు పన్ను విధించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు చెప్పారు. ఇంకా చర్చల్లోనే ఉంది కాగా తమిళనాడు సినీ థియేటర్ల సంఘం అధ్యక్షుడు అభిరామి రామనాథన్ ఈ విషయమై మాట్లాడుతూ సినిమా టికెట్ల ధర పెంపు విషయం ఇంకా చర్చల్లోనే ఉందని చెప్పారు.తుది నిర్ణయం జరగలేదని అన్నారు.అయితే సినిమా టికెట్ల ధరను పెంచుకునే అధికారం ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికే ఇచ్చిందని తెలిపారు.కోల్‌కొతా, బెంగళూరు వంటి నగరాల్లో వార చివరి రోజుల్లో టికెట్లపై అధిక ధరలను వసూలు చేసే విధానాన్ని చెన్నైలో ఎందుకు అమలు పరచరాదని ఆయన ప్రశ్నించారు.మొత్తం మీద సగటు ప్రేక్షకుడికి ఇకపై సినిమాలు చుక్కల్ని చూపించబోతున్నాయన్నది వాస్తవం. -
హోటళ్లలో ఆహారపదార్థాలకు పన్నులేదు
♦ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ టీనగర్: హోటళ్లలో ఆహార పదార్థాలకు కొత్తగా జీఎస్టీæ పన్ను విధించలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ పాత పన్నుకు సమానంగా కొత్త పన్నును విధించామని అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ ఒక్కో వస్తువుపై ఏ మేరకు పన్ను విధించాలో అనే విషయంపై కొన్ని మార్గదర్శకాలను రూపొందించిందని ప్రస్తుతం ఉన్న పన్ను కంటే తక్కువ పన్ను విధింపునకు ప్రాముఖ్యతనిచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. -
వాటిపై జీఎస్టీ తగ్గించండి
- బీడీలు, గ్రానైట్, తాగునీరు, సాగునీటిపై అధిక పన్నుతో పెనుభారం - ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం కేసీఆర్ లేఖలు సాక్షి, హైదరాబాద్: బీడీ పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ, మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం లేఖలు రాశారు. రాష్ట్రంలో వేలాది మంది బీడీలు చుట్టి బతుకుతున్నారని, బీడీ పరిశ్రమపై అధిక పన్నులు వేయడం వల్ల వారి ఉపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో 2 వేలకుపైగా ఉన్న గ్రానైట్ యూనిట్లలో రెండు లక్షల మంది ప్రత్యక్షంగా, ఐదు లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. గ్రానైట్, మార్బుల్ ముడి బ్లాక్లపై 12 శాతం, ఫినిషింగ్ ఉత్పత్తులపై 28 శాతం పన్ను విధిస్తూ జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుందని, అంత ఎక్కువ పన్ను వేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముంద న్నారు. రా బ్లాక్స్, ఫినిష్డ్ ఉత్పత్తులు... రెండింటిపై 12% పన్ను విధించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు మిషన్ భగీరథ, రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై అత్యధిక జీఎస్టీ విధించడం భావ్యం కాదని, వీటిపై పునరాలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగింటిపై విధించిన పన్ను రేట్లు తమ రాష్ట్రంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సందర్భంగా దేశం మొత్తం మీద ఒకే పన్ను విధానం ఉండేందుకు జీఎస్టీ అమలు చేయడంపట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. -
జీఎస్టీ తగ్గించకుంటే వైదొలగుతా
► ఫిలిం ఛాంబర్ సమావేశంలో కమల్ జీఎస్టీ పన్ను తగ్గించకుంటే తాను సినిమా నుంచి వైదొలగుతానని విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. వివరాల్లో కెళితే..కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తున్న జీఎస్టీ పన్ను విధానం సినిమా పరిశ్రమపై పెనుభారం మోపనుంది. ఇతర రంగాల మాదిరిగానే సినిమాలకు 28 శాతం పన్నుభారం పడనుంది. దీనిని సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ జీఎస్టీ పన్ను విషయంలో పునఃపరిశీలన చేయాలని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి స్థానిక అన్నాసాలైలోని ఫిలిం ఛాంబర్లో సమావేశాన్ని నిర్వహిం చింది. ఈ సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు ఎల్.సురేష్‌తో పాటు నటు డు కమలహాసన్, రవి కొటార్కర, అభిరామి రామనాథన్, కాట్రగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమలహాసన్ మాట్లాడుతూ సినిమా అన్నది జూదం కాదన్నారు. అది ఒక కళ అని సినిమా టికెట్‌పై విధించనున్న 28 శాతం జీఎస్టీ పన్నును తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ పన్ను వలన సినిమా బాధింపునకు గురవుతుందన్నారు. అందువలన ఈ పన్ను విధానాన్ని కనీసం 12 నుంచి 18 శాతం వరకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో భారతీయ చిత్రాలకు 28 శాతం జీఎస్టీ పన్ను విధించడం సబబు కాదన్నారు. ఒక వేళ ఈ పన్ను విధానాన్ని హిందీ చిత్ర పరిశ్రమ ఆమోదించినా తాము మాత్రం అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సినిమాకు 28 జీఎస్టీ పన్ను విధానంపై పునరాలోచించాలని లేని ఎడల తాను సినిమా నుంచి వైదొలుగుతానని కమలహాసన్ ఆవేశంగా అన్నారు. కాగా జీఎస్టీ పన్ను తగ్గించాలని కోరుతూ త్వరలో కేంద్ర మంత్రి అరుణ్జైట్లిని కలవనున్నట్లు దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎల్.సురేష్ వెల్లడించారు. -
పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిరాశాజనకంగా ముగిసింది. పన్ను పరిధిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ్టి సమావేశంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ ముసాయిదాలపై చర్చ జరిగినట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
'రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవారిని అక్కడే ఉంచాలి'
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులో రూ.1.5 కోట్ల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కోరారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. రూ.1.5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు సంబంధించిన పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలే నియంత్రించే విధంగా వెసులుబాటు క ల్పించాలని ఈ సమావేశంలో కోరినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న కొన్ని గూడ్స్, సర్వీస్ ట్యాక్స్‌లను కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉంచాలని కోరామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి.. ప్రజలకు మేలు చేసే సంకల్పంతో పనిచేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు. తెలంగాణకు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) పరిహారం కింద రూ, 10,440 కోట్ల నిధులు అందాల్సి ఉందని, వాటిని తక్షణమే విడుదల చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరామన్నారు. రాష్ట్రాల్లో కొన్ని రకాల వస్తువుల ఉత్పత్తి మీద వివిధసంస్థలకు రాయితీలు ఇస్తున్నామని, జీఎస్టీ అమలు తరువాత ఈ రాయితీల విషయంలో నిధుల భారాన్ని రాష్ట్రాలు భరించాలా లేక, కేంద్రం భరించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉందని ఈటల పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఇంకా అనేక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని ఈటల చెప్పారు. -
కొత్త పన్నుతో రూ.8,552 కోట్ల నష్టం!
- జీఎస్టీ పన్నుతో రాష్ట్ర ఆదాయానికి భారీగానే చిల్లు - నేడు తిరువనంతపురంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల భేటీ హైదరాబాద్: కేంద్రం తీసుకువచ్చిన వస్తువులు.. సేవల పన్ను (జీఎస్టీ)తో తెలంగాణకు ఏటా రూ.7,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుంది. ఇప్పటివరకు ప్రతిపాదనల్లో ఉన్న ఈ పన్నుకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. దీంతో జీఎస్టీ పన్నుల ప్రభావమెలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. వరి, పొగాకు ఉత్పత్తులు, పెట్రోలు, ఎక్సైజ్ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్టీ పాత బకాయిలు చెల్లించటంతో పాటు తాము సూచించినవాటిని మినహాయిస్తే.. జీఎస్టీని స్వాగతిస్తామని ఇప్పటికే ప్రకటించింది. గత నెలలో ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ భేటీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాగా, జీఎస్టీపై చర్చిం చేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఎంపవర్డ్ కమిటీ గురువారం కేరళలోని తిరువనంతపురంలో మరోమారు సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ సమావేశానికి హాజరవనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం జీఎస్టీతో ప్రస్తుతం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో తగ్గిపోతోంది. వరి, ఆహార ఉత్పత్తులపై వచ్చే సెస్ ద్వారా ప్రస్తుతం రాష్ట్ర ఖజానాకు రూ.700 కోట్లు వసూలవుతోంది. దీంతో పాటు పొగాకు, పొగాకు అనుబంధ ఉత్పత్తులపై అత్యధికంగా 20 శాతం పన్ను అమల్లో ఉంది. దీన్ని జీఎస్టీలో కలపటంతో ఏటా దాదాపు రూ.500 కోట్లు ఆదాయం వస్తుంది. ఇప్పుడు అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోవాల్సి వస్తుంది. క్రమంగా కేంద్ర అమ్మకపు పన్ను (సీఎస్టీ) ఎత్తివేత కారణంగా ఏటా పన్నుల ద్వారా రూ.4,840 కోట్ల ఆదాయాన్ని రాష్ట్రం నష్టపోతుందని తెలంగాణ ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2013-14 వార్షిక ఆదాయం లెక్కల ఆధారంగా ఈ అంచనా వేసింది. వ్యాట్‌ను సైతం జీఎస్టీలో విలీనం చేయటంతో మరో రూ.2,113 కోట్లకు పైగా నష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషించాయి. లగ్జరీ పన్ను, ఎంట్రీ టాక్స్‌లను సైతం జీఎస్టీలో కలిపితే తెలంగాణకు మరో రూ.399 కోట్లు నష్టం వాటిల్లుతుంది. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.8,552 కోట్ల రెవెన్యూను కోల్పోయే ప్రమాదముంది. అంత మేరకు రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిహారంగా నిధులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జీఎస్టీ బిల్లుకు సంబంధించి చేయాల్సిన సవరణలను సూచించింది. జీఎస్టీ అమల్లోకి వస్తే రాష్ట్ర ఆదాయంపై ప్రభావం పడటం ఖాయమని.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ఎంత పరిహారం చెల్లిస్తుంది.. ఏయే ఉత్పత్తులకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది.. అనేది వేచి చూడాల్సి ఉందని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు.