
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 25న రైతులతో సమావేశం కానున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున దేశ రాజధానిలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోఆందోళన నేపథ్యంలో రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆ పార్టీ నిర్ణయించారు. మాజీ ప్రధాన అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ...రైతులతో భేటీ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2,500 ప్రాంతాల్లో కిసాన్ సంవాదక్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు
మరోవైపు రైతుల ఆందోళనలు 25వ రోజుకు చేరాయి. ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఆల్ ఆఫ్ ఫార్మర్స్ ఏర్పాటు అయింది. ఇక సామాజిక వేత్త అన్నాహజారే రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టనున్నారు. దీక్షా స్థలం కోసం ఢిల్లీ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment