న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొంతకాలంగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. మూడు లక్షలకు పైగా వెలుగుచూస్తున్న కేసులు తాజాగా తగ్గుముఖం పట్టాయి. అయితే ముందు రోజు కంటే స్వల్ప పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 11 శాతం ఎక్కువ నమోదయ్యాయి. కరోనాతో నిన్న 665 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
అలాగే, నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,73,70,971గా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు 5.55 శాతం, రికవరీ రేటు 93.23%గా ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 1,63,58,44,536 వ్యాక్సిన్ డోసులు వేశారు.
చదవండి: (గులాంగా ఉండాలని కోరుకోవడం లేదు!.. అజాద్‌గా ఉండాలనుకుంటున్నారు!)
Comments
Please login to add a commentAdd a comment